ETV Bharat / state

వైద్య ఆరోగ్య, పోలీస్‌ శాఖలకు పూర్తి వేతనం... జీఓ జారీ - వైద్య ఆరోగ్య, పోలీస్‌ శాఖలకు పూర్తి వేతనం...జీఓ జారీ

రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు, ఇతర అన్ని శాఖల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది సర్కారు. వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖ ఉద్యోగులకే పూర్తి వేతనం అందించనున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ

author img

By

Published : Apr 3, 2020, 3:30 PM IST

వైద్య ఆరోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్కారు నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది. ఈ మేరకు గతంలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆ రెండు శాఖలకు మినహాయింపు...

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్యులు, సిబ్బంది విశేష సేవలందిస్తున్నందుకు పూర్తి వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్​లో పోలీసులు నిర్వహిస్తున్న కీలకపాత్రను గుర్తిస్తూ పోలీసు శాఖకూ పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు జీతాల్లో కోత విధిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల నుంచి వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలను మినహాయించారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి : ఇవి తింటే కరోనాను ఎదుర్కొనే శక్తి మీ సొంతం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.