ETV Bharat / state

'ఒరేయ్​' అన్నందుకు చంపేశాడు - హైదరాబాద్​లో హత్య

స్నేహితులన్నాక సరదా మాటలు సర్వసాధారణం. కానీ అవే సరదా మాటలు ఒకరిని పొట్టన పెట్టుకున్నాయి. 'ఒరేయ్' అని పిలవడం వల్ల మద్యం మత్తులో ఉన్న ఓ మిత్రుడు తన స్నేహితుడినే హత్య చేసిన ఘటన హైదరాబాద్​ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

friend murder in Hyderabad
'ఒరేయ్​' అన్నందుకు చంపేశాడు
author img

By

Published : Jan 21, 2020, 8:33 PM IST

సరదాగా మద్యం తాగుతూ ఒరేయ్​ అని పిలిచినందుకు తన స్నేహితుడినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషాద ఘటన హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది

మూసాపేట యాదవ బస్తీలో నివసించే తాడాల సుధీర్ సోమవారం రోజు రాత్రి తన స్నేహితులు నవీన్, కిరణ్, రాంబాబులతో కలిసి ఖైత్లాపూర్ మద్యం దుకాణం పక్కనే ఉన్న నిర్జన ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో మరో ముగ్గురు స్నేహితులు కిరణ్, సాబేర్, హర్షవర్దన్​లు సుధీర్​ దగ్గరకు వచ్చి అందరూ కలిసి మద్యం సేవించారు.

అదే సమయంలో, సుధీర్.. సాబేర్​ని ఒరేయ్ అని పిలవడం వల్ల నన్ను ఒరేయ్ అని పిలుస్తావా అంటూ సాబేర్, సుధీర్​తో గొడవ పడి, పక్కనే ఉన్న బీరు సీసాను పగులగొట్టి గొంతులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సుధీర్​ని అతడి మిగితా స్నేహితులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సాబేర్​ని అదుపులోకి తీసుకున్నామని కూకట్​పల్లి సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.

'ఒరేయ్​' అన్నందుకు చంపేశాడు

ఇవీ చూడండి:రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు ​పూర్తి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.