ETV Bharat / state

ఏడాదిపాటు ఉచితంగా ఎన్టీఆర్ సినిమాలు.. ఎక్కడంటే! - ఎన్టీఆర్

Free Screening Of NTR Films In Guntur : ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్ ప్రత్యేక కార్యక్రమాలకు వేదికైంది. ఆయన నటించిన చిత్రాలను ఏడాదిపాటు థియేటర్లో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు ఈ హాల్ యజమాని ఎన్టీఆర్ కావటమే ఈ థియేటర్ ప్రత్యేకత.

Free Screening Of NTR Films In Guntur
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్​
author img

By

Published : Nov 9, 2022, 10:57 AM IST

ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాలు

Free Screening Of NTR Movies : వెండితెర కథానాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయనకు సొంతంగా సినిమా థియేటర్లు కూడా ఉండేవి. వాటిలో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని రామకృష్ణ థియేటర్ ఒకటి. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఏడాదిపాటు ప్రదర్శించాలని నిర్ణయించారు. ఆ సినిమాల ప్రదర్శనకు పెమ్మసాని థియేటర్‌ను ఎంచుకున్నారు. సినిమాలు చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల్ని చూస్తుంటే ఎన్టీఆర్​పై అభిమానం ఇప్పటికీ తగ్గలేదనిపిస్తోందని చెబుతున్నారు.

"ఎన్టీఆర్​ నటించిన మంచి సినిమాలన్నింటికీ ప్రతి ఆటకి రోజు 400 మందికి తగ్గకుండా వస్తున్నారు. మా థియేటర్​ కెపాసిటీ 470 అయితే ప్రతిరోజు 300 మందికి పైగా వస్తున్నారు. డ్రైవర్​ రాముడు, వేటగాడు.. ఇలా మరి కొన్ని సినిమాలకు చాలా మంది జనాలు చూడడానికి వచ్చి.. థియేటర్​లో స్థలం లేకుండా ఉండటంతో 200 మంది తిరిగి ఇంటికి వెళ్లారు"-పెమ్మసాని పోతురాజు, థియేటర్ యజమాని

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8గంటల30నిమిషాలకు మొదటి ఆటగా ఎన్టీఆర్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. సినీరంగానికి చెందిన ఓ ప్రముఖుడికి ప్రతినెలా ఎన్టీఆర్ అవార్డు అందజేస్తున్నారు. రాఘవేంద్రరావు, జయసుధ, అశ్వినిదత్, ఎల్.విజయలక్ష్మి వంటివారు ఇప్పటి వరకూ ఎన్టీఆర్​​ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్​ సొంత థియేటర్‌లో ఆయన చిత్రాలన్నింటినీ ప్రదర్శించడం ద్వారా.. ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఎన్టీఆర్ చిత్రాలన్నింటినీ డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా తెరపై ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. శ్రీ వేంకటేశ్వర మహత్యం సినిమాతో ప్రదర్శనలు మొదలుపెట్టారు. శతాబ్ది ఉత్సవాలు పూర్తయ్యేసరికి 250కి పైగా సినిమాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇలా ఒకే నటుడి సినిమాలను ఏడాది పాటు ఉచితంగా ప్రదర్శించటం ఓ రికార్డని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.