రజకులు, నాయీ బ్రాహ్మణులు నిర్వహించుకునే లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ కోసం జూన్ నెలలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నెలకు 250 యూనిట్ల కరెంట్ బిల్లు రాయితీలకు సంబంధించి జూన్ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. లాండ్రీ, దోబీఘాట్లు, క్షవరశాలలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కోసం www.tsobmms.cgg.gov.in వెబ్ సైట్‌లో లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. దుకాణాల వివరాలు, ఫొటో, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అనుమతులు, కార్మిక లేదా వాణిజ్య లైసెన్సులను అప్లోడ్ చేసి స్వీయ ధృవీకరణ జతచేయాలని మంత్రి తెలిపారు. 250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతి నెలా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందని గంగుల చెప్పారు.
ఇదీ చదవండి: CM KCR: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష