బాలికా సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని బంజారా మహిళా ఎన్‌జీవో ఛైర్మన్ డాక్టర్ ఆనంద్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వారధి సంస్థ, బంజారా మహిళా ఎన్‌జీవో సంయుక్తంగా ఉచిత వైద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మెహదీపట్నంలోని రాధా కిషన్ అనాథ బాలికా గృహంలోని బాలికలక పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
బాలికలందరికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి శానిటరీ ప్యాడ్స్, కాల్షియం వంటి ఔషధ గుళికలు అందించారు. బాలికలకు అవసరమైన సహాయాన్ని అందించిన వారధి సంస్థకు డాక్టర్ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్, డాక్టర్ సరళ, డాక్టర్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.