రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తుల పరిశీలన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తక్షణమే జీవో జారీచేయాలని సీఎంవో కార్యదర్శికి కేసీఆర్ ఆదేశించగా...వెంటనే విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : పత్తి రైతులపై రూ.కోట్ల భారం..పెరగనున్న విత్తన ధరలు