Free Bus Travel Scheme in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పథకాల వల్ల సామాన్య మహిళలకు చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. మహాలక్ష్మి పథకంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పెంపు కార్యక్రమాన్ని ప్రజలకు చేరువచేస్తున్నారు.
EX Central Minister Renuka Chowdary on Mahalakshmi Scheme : కాంగ్రెస్ (Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన మహాలక్ష్మి, రాజీవ్‌ఆరోగ్యశ్రీ పరిమితి పదిలక్షలకు పెంపును ప్రభుత్వం అమలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం మొత్తం మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka Chowdary) అన్నారు. ఉచిత బస్ సౌకర్యం సేవలను వినియోగించుకుంటున్న మహిళలతో కలిసి ఆమె బస్సు ప్రయాణం చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో మహిళలు ప్రతిరోజూ డబ్బును ఆదా చేసుకుంటున్నారని తెలిపారు.
మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టీసీ పుంజుకుంటుంది : సజ్జనార్
సికింద్రాబాద్ జేబీఎస్ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీచేశారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న ఆయనసిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తేచ్చేందుకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
RTC MD Sajjanar Sudden Inspection in JBS : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మున్ముందు అదనంగా బస్సులు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు హైదరాబాద్‌లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేసినప్పటి నుంచి రద్దీపెరిగిందని అందుకు తగ్గట్లుగా మరిన్ని బస్సులను ప్రవేశ పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ను మరవద్దు : జగ్గారెడ్డి
వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, హనుమకొండ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మహిళలకు ఉచితప్రయాణ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం
Congress Six Guarantees : వంద రోజుల్లో వందశాతం ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకం, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పదిలక్షలకు పెంపు పథకాలను ప్రారంభించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. పథకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న ప్రజలు వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నారు.