విద్యా, వైద్య శాఖల పద్దులపై ఇవాళ శాసనసభలో చర్చ జరగనుంది. బడ్జెట్ పద్దులపై గత మూడు రోజులుగా చర్చ జరుగుతోంది. నాలుగో రోజైన ఇవాళ విద్య, వైద్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల పద్దులపై చర్చ జరుగనుంది. అటు ప్రశ్నోత్తరాల్లో విత్తనభాండాగారంగా తెలంగాణ, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, మెట్రో రైలు పనులు, పోలీసు స్టేషన్ల ఆధునీకరణ, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం, ఔషధనగరి, ప్రైవేటు విద్యాసంస్థలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
ఇవీ చూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్