ఏపీ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అశ్వినీ లాడ్జ్‌లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వినీలాడ్జ్ 106 గదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అప్పలరాజు-మానస దంపతులు, కుమార్తె కీర్తి (6), కుమారుడు స్వాత్విక్ (5). వీరు పెందుర్తి బంధువానిపాలెం వాసులుగా గుర్తించారు. అప్పుల సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు లేఖలో వెల్లడించారు. అప్పలరాజు కుటుంబం మృతిపై బంధువులకు ద్వారక పోలీసులు సమాచారమిచ్చారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్