రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తోందని... క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తూ... వారు ఎదిగేందుకు సహకరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. హైదరాబాద్ బోయగూడ కమాన్ వద్ద వీర్ మారుతి వ్యాయామశాల-దంగల్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వం తరఫున 30 లక్షల రూపాయలు అందిస్తున్నామని... నిర్మాణంలో మరిన్ని నిధులు అందించేందుకు సిద్ధమన్నారు. మరుగున పడుతున్న కుస్తీని కొనసాగిస్తున్న యువతను మంత్రి తలసాని అభినందించారు.
ఇదీ చూడండి: 'మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా'