హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో హోమంత్రి మహమూద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న ఈ నిర్మాణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని హోంమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో దర్గాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఈ దర్గా నుండే ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారని ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఎమ్మెల్సీ సలీం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జడ్పీ వైస్ ఛైర్మన్ పదవికి కోనేరు కృష్ణారావు రాజీనామా