ETV Bharat / state

'చరిత్రను విస్మరించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ చరిత్రను వక్రీకరించే పార్టీల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాఎగురవేశారు.

'చరిత్రను విస్మరించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Sep 17, 2020, 2:53 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సం పురస్కరించుకొని భాజాపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్​ ముషీరాబాద్​లోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ
పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ

రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆరేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఆ విషయాన్ని విస్మరించారని కె.లక్ష్మణ్​ ఆరోపించారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. చరిత్రను విస్మరించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండపల్లి మాధవ్, ముషీరాబాద్ నియోజకవర్గం భాజపా కో కన్వీనర్ నవీన్ గౌడ్ తిరుపతమ్మ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బెడిసికొట్టిన రిపోర్టర్​ డీలింగ్​... ట్రాప్​లో పడి కిడ్నాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.