రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రం ప్రచారం చేస్తుందని... కానీ ఉన్న ఉపాధి పోతుందని అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో కిసాన్ సెల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు.
ఈ చట్టాలతో కేవలం రైతులే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. రైతులను చైతన్యపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: 'ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు!'