కృష్ణా జలాలను నీటి చట్టాలకు వ్యతిరేకంగా ఏపీ రాష్ట్రం తరలించుకుపోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపుతోపాటు కాలువలు వెడల్పు చేసేందుకు మరో జీవీని ఏపీ ప్రభుత్వమిచ్చిందని.. అదే ఆచరణలోకి వస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సముద్రంలోకి నీరు వృథా పోకుండా వాడుకోవాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏపీకి చెప్పడం వల్లే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నీటి తరలింపునకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కృష్ణా బేసిన్ నీటిని పెన్నా బేసిన్‌కు ఎలా తరలిస్తారని నాగం ప్రశ్నించారు. ఒక నది బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు నీటిని వాడుకోవడానికి నీటి చట్టాలు అనుమతించవని మాజీ మంత్రి స్పష్టం చేశారు.