హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ భాజపా కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్‌పై మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్ ఇద్దరు పిల్లల నిబంధనను ఉల్లంఘించటంతోపాటు ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు.
వెంకటేశ్ నాలుగో కూతురు బర్త్ సర్టిఫికేట్ ఫోర్జరీ చేశాడనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సూర్యనారాయణ తెలిపారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్‌పై ఎన్నికల ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయన ప్రమాణస్వీకారాన్ని ఆపాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశామని తెలిపారు. సిటీ సివిల్ కోర్టులోని ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఈ కేసును మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సూర్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: 'నిజాయితీకి నియంతృత్వానికి మధ్య జరిగే ఎన్నికలివి'