Former CBI JD Lakshminarayana ON Human Rights: ఏ దేశంలో అయితే మానవ హక్కులు రక్షించబడతాయో.. ఆ దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగిస్తారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ హక్కుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
మానవ హక్కుల సంఘాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎక్కడైతే మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతాయో.. వారి పరిరక్షణకు పోరాటాలు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ హక్కులను గౌరవించే విధంగా వారి పాలన సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
"మానవ హక్కులు అనేవి ప్రధానం. ఏ దేశంలో అయితే మానవ హక్కులు రక్షించబడతాయో ఆ దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగిస్తారు. ఎవరైతే మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సేవలు బాగున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన కల్పించాలి. మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత సభ్య సమాజంపై ఉంది." - లక్ష్మీనారాయణ సీబీఐ మాజీ జేడీ
ఇవీ చదవండి: భాజపా చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదు: మల్లికార్జున ఖర్గే
హైవే మధ్యలో రాయి.. పూజిస్తే చాలు.. మోకాళ్లు, కీళ్ల నొప్పులు మాయం!