ETV Bharat / state

'సర్వే చేయండి... ఆగం చేయకండి'

తాతలు, ముత్తాతల కాలం నుంచి ఆ భూములు సాగు చేసుకొని బతుకున్నారు. ఇప్పుడేమో... అటవీశాఖ అధికారులు వచ్చి అవి ప్రభుత్వ భూములని, అందులో ఏమీ పండించకూడదని ఆంక్షలు విధిస్తూ... తమ జీవనానికి ఆటంకం కల్గిస్తున్నారంటూ ఆ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Aug 4, 2019, 7:23 PM IST

'సర్వే చేయండి... ఆగం చేయకండి'
'సర్వే చేయండి... ఆగం చేయకండి'

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం లోక్యా తండావాసుల బతుకు భారంగా సాగుతోంది. ఇన్నాళ్లు తమ తాతల నుంచి వచ్చిన భూములను సాగు చేసుకుంటూ... జీవనం సాగించారు. వారికి పట్టా పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళనలో వారికి పట్టాపాసు పుస్తకాలు రాలేదు. వాటి కోసం ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఆ భూములు తమకి చెందినవని వాటి సాగు చేయడం కుదరదని చెప్పారు.

గత ప్రభుత్వాలు కేటాయించిన ఆ భూములను అటవీ సిబ్బంది అడ్డగిస్తూ సర్వే చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంట కాలం ప్రారంభమైనప్పటికీ... సర్వే చేయనందున సాగు చేయలేకపోతున్నామన్నారు. పంటలు పండించే వీలులేక చేసేందుకు వేరే పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు వాపోతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెవెన్యూ అధికారులతో భూమి సర్వే చేయించాలని కోరుతున్నారు. తమ భూములు తమకు ఇప్పించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు

Intro:tg_nlg_51_2_forest_boomula_servy_pkg_TS10064
తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన గిరిజనుల పాలిట శాపంగా మారిందని ని గిరిజన రైతులు వాపోతున్నారు గత ప్రభుత్వాలు అటవీశాఖ భూములను కూడా తమ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రుణ సదుపాయం పొందిన భూములకు కూడా భూ ప్రక్షాళన పేరుతో తో రెవిన్యూ వారికి అటవీ శాఖ వారికి సమన్వయం లేకపోవడంతో తమ భూములను సాగు చేసుకోవడానికి కి ని అడ్డంకిగా మారిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలు ఉన్న భూములకు రైతుల మొర తో ఎట్టకేలకు సర్వే ను ప్రారంభించిన రెవిన్యూ , అటవీశాఖ అధికారులు.

Body:త్రిపురారం మండల పరిధిలోని లో క్యా తండా గ్రామం లో గత ప్రభుత్వాలలో కాలంలో దాదాపు వంద ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి సాగు చేసుకుంటున్న రైతులకు భూ ప్రక్షాళన పేరుతో రావడంతో పట్టా చేయమని రైతులు పదేపదే రెవెన్యూ శాఖ చుట్టూ తిరిగిన అటవీ శాఖ వారి గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు సంబంధించిన భూములను ఫిర్యాదు చేయడంతో ఆ భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిన రెవిన్యూ శాఖ వారు సాగుచేసుకోవడానికి వెళ్లిన రైతులకు అటవీశాఖ అధికారులు వాటిని సాగు చేసుకుని ఇవ్వడంలేదని ఇట్టి విషయంపై రెవిన్యూ శాఖ వారు అటవీశాఖ వారు కలిసి ఇ సర్వే నిర్వహించి తమ భూములు తమకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ ఉన్నతాధికారుల చుట్టు గిరిజన తిరిగి తిరిగి విసిగిపోయారు తమకు రైతుబంధు రైతు బీమా పథకాలు వర్తించక పోయినప్పటికీ తాము సాగుచేసుకుంటున్న భూమిని సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సర్వేను త్వరగా పూర్తిచేసి ఇ అవి రెవెన్యూ భూముల అటవీశాఖ భూముల త్వరగా తేల్చి తమకు న్యాయం చేయాలని రైతులు అంటున్నారు.
బైట్: హనుమానాయక్ లోక్యా తండా, సర్పంచ్.
బైట్: రాములు నాయక్, రైతు

Conclusion:గత ప్రభుత్వాలు తమకు కేటాయించిన భూములను అటవీశాఖ వారు అడ్డగించి సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారని ని రెవెన్యూ శాఖకు అటవీశాఖకు సమన్వయం లేకపోవడంతో గిరిజన రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఖరీఫ్ పంట కాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ సర్వే ఎటూ తేల్చకపోవడంతో తాము సాగు చేసుకుంటామంటే వద్దని అటవీశాఖ వారు హెచ్చరించడంతో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి భయపడుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా తమ భూములను సాగు చేసుకోకుండా కనీసం రైతు పథకాలు కూడా లభించకుండా తాము నష్టపోవాల్సి వస్తుందని సర్వే త్వరగా పూర్తిచేసి ఇ గిరిజన రైతులకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఇప్పుడు మొదలు పెట్టిన సర్వే త్వరగా పూర్తి చేసి ఇ తమకు న్యాయం చేయాలని రైతులు ఆశతో ఉన్నారు.
బైట్: కాంతారావు, రైతు
బైట్: బీక్య నాయక్, రైతు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.