వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో ఫోరెన్సిక్ బృందం మరోమారు నమూనాలు సేకరిస్తున్నారు. గోనె సంచుల గోదాముతో పాటు బావి పరిసరాల్లో నమూనాల సేకరణ జరిగింది. ఘటనా స్థలిని అదనపు డీసీపీ వెంటలక్ష్మీ, టాస్క్ఫోర్స్ పోలీసులు పరిశీలించారు.
గొర్రెకుంట ఘటనపై 6 బృందాలు దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు ఏసీపీ శ్యామ్‌సుందర్ పేర్కొన్నారు. అనేక కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని వివరించారు.
నివేదిక రావడానికి 10 రోజులు పడుతుందని ఫోరెన్సిక్ నిపుణులు రాజామాలిక్ తెలిపారు. విష ప్రయోగం జరిగిందనే కోణంలో ఆహార పదార్థాల పరీక్ష జరుపుతున్నట్లు చెప్పారు. మృతదేహాలపై గాయాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఘటనపై ఆధారాలను సేకరించామని ప్రకటించారు.
ఇదీ చదవండి: బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!