హైదరాబాద్ రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గిరి నగర్లో రోడ్డు పక్కనే ఫుట్పాత్ మీద గుడిసెలు వేసుకొని చాలామంది అభాగ్యులు జీవనం సాగిస్తున్నారు. పొట్టకూటి కోసం.. స్థానికంగా ఉండే మాంసం దుకాణదారులకు మేకలు, గొర్రెల తలకాయలు కాల్చి ఇస్తుంటారు. అటు పనికోసం.. ఇటు తాగునీరు, ఇతర అవసరాల కోసం నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా పైప్లైన్ లీక్ అయితే.. అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
గిరి నగర్లో లీక్ అవుతున్న పైప్లైన్ నుంచి మగ్గుతో నీళ్లు తోడుకొని బిందెల్లో నింపి వాడుకుంటున్నారు. చాలారోజులుగా ఇవే నీరు తాగుతున్నట్టు.. ఆ మహిళలు తెలిపారు. రక్షిత మంచినీటి పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఎన్ని పథకాలొచ్చినా.. ఇలాంటి వారు ఇంకా.. రోడ్డు పక్కన లీకయ్యే నీటినే తాగుతున్నారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు