హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రీజెన్సీ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఆహారోత్సవం ఏర్పాటు చేశారు. దావత్ ఈ లజీజ్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో శాఖాహార, మాంసాహార వంటకాలతో పాటు కబాబ్స్, స్ట్రీట్ ఫుడ్‌ను ఏర్పాటు చేశారు. పుస్తకాల్లో నేర్చుకున్నది, స్వయంగా తయారు చేయడం గొప్ప అనుభూతిని కలిగించిందని విద్యార్థులు వెల్లడించారు. విద్యార్థులకు చదువుతో పాటు స్వీయ అనుభవం రావాలనే ఈ ఆహారోత్సవం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల తమలో సరికొత్త ఉత్సాహం కలుగుతుందని విద్యార్థులు అంటున్నారు.
ఇవీచూడండి: కుక్కపై గోమాత వాత్సల్యం.. పాలిచ్చిన వైనం!