వరద ముంపు ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.పది వేల ఆర్థిక సహాయం అందక బాధితులు హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. గోశామహల్, బేగంబజార్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందని బాధితులు... అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలమంటూ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వరదల వల్ల ముంపునకు గురైన వారికి ఆర్థిక సాయం చేయకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినవారికి డబ్బులు పంచుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్: కేసీఆర్