గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటి వరకు మొత్తం 6.64 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ. 664 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు పురపాలక శాఖ వెల్లడించింది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 1 వరకు ప్రత్యక్షంగా రూ. 4.86 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని పేర్కొంది.
గత మూడు రోజుల్లో 2.86 లక్షల కుటుంబాలు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని... వీటిలో 1.78 లక్షల కుటుంబాలను ధ్రువీకరించుకుని రూ. 178 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం దరఖాస్తుల నమోదు, పంపిణీ ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చదవండి: 'ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా.. అల్లర్ల హైదరాబాద్ కావాలా..?'