వంద రకాల వంటకాలతో... భాగ్యనగరంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ - బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్
భాగ్యనగరం మరో ఫుడ్ ఫెస్టివల్‌కు వేదిక కాబోతోంది. మూడు రోజుల పాటు... వివిధ రకాల చేపల వంటకాలు నగరవాసులను నోరూరించనున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో 'ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఛైర్మన్ కొప్పు పద్మ తెలిపారు.
![వంద రకాల వంటకాలతో... భాగ్యనగరంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ fish food festival starts on last week of february month](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6177303-3-6177303-1582462375148.jpg?imwidth=3840)
సముద్ర చేపలతో పాటు చెరువుల్లో దొరికే 20 రకాల చేపలతో తయారు చేసే 100 రకాల వంటకాలతో హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నగరంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 28, 29 మార్చి 1వ తేదీల్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతున్న ఈ ఫెస్ట్‌లో వివిధ రకాల చేపల వంటకాలు నగరవాసులను నోరూరించనున్నాయి.
నోరూరించే రకరకాలు పంటకాలు...
'చేపలు పౌష్టిక ఆహారం... చేపలు తినండి, ఆరోగ్యంగా ఉండండి' అనే నినాదంతో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో ఫిష్ బిర్యానీ, జొన్న రొట్టె, రాగి సంకటి చేపల పులుసు, ఫిష్ కట్లెట్, ఫిష్ లాలీపాప్, ఫిష్ దిల్ పసంద్, ఫిష్ రోల్, ఫిష్ సమోసా, ఫిష్ బాల్స్, ఫిష్ వడియాలు, ఫిష్ జంతికలు, ఫిష్ అప్పడాలు... వంటి 100 రకాల ఫిష్ వెరైటీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మహిళలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం ఛైర్మన్ కొప్పు పద్మ తెలిపారు.
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పోస్టర్‌ను హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ ఫెస్ట్‌ను మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారని హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఛైర్మన్ కొప్పు పద్మ తెలిపారు. 20 రకాల చేపల వంటకాలు, పచ్చి చేపలు స్టాల్స్ అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతుల అందజేత
TAGGED:
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్