ETV Bharat / state

Fire Week In Telangana: వారం రోజులు.. 900లకు పైగా అవగాహన కార్యక్రమాలు

author img

By

Published : Apr 21, 2023, 1:35 PM IST

Fire Week In Telangana: అగ్నిమాపకశాఖ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా.. 900లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అవగాహనతో పాటు ప్రమాద నివారణ చర్యలను అధికారులు వివరించారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో.. అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

fire week
fire week
వారం రోజులుగా సాగిన అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రమాదాలపై శిక్షణ.

Fire Week In Telangana: అగ్నిమాపకశాఖ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు.. 900లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అవగాహనతో పాటు ప్రమాద నివారణ చర్యలను అధికారులు వివరించారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో.. అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఏప్రిల్​ 14నే ఎందుకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారంటే: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యుద్ధ ఓడలో కాటన్, బంగారం, మందుగుండు సామగ్రి, 1400 టన్నుల మిశ్రమ సరకును తీసుకువెళుతున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో 66 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన సిబ్బంది త్యాగాన్ని స్మరించుకోవడానికి.. ఏప్రిల్ 14న అగ్నిమాపక దినోత్సవంగా పాటించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు: అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా వివిధ రకాల అగ్నిప్రమాదాలపై.. అధికారులు ప్రజలకు అవగహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎత్తైన భవనాలు, షాపింగ్ మాల్‌లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్, పరిశ్రమలలో అగ్నిప్రమాదంపై అవగాహనతో పాటు ప్రమాద సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షణ ఇచ్చారు. పెట్రోల్ బంకులు, వంట గ్యాస్ నిల్వ ఉండే గోడౌన్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, నివాస కాలనీల్లో ఎల్పీజీ భద్రత, విద్యుత్ అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు.

నష్టాలను తగ్గించడంతో పాటు ప్రమాద నివారణ చర్యలపై.. ప్రజలకు శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌ మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు అగ్నిమాపక వాహనాలతో 60 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. జీడిమెట్లలోని అగ్నిమాపక కేంద్రంలో ఇండస్ట్రియల్ ఫైర్ సేఫ్టీపై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎలా బయట పడాలో ప్రజలకు తెలియజేశామని అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

"గత వారంలో 7 వేల నుంచి లక్ష మంది ప్రజలు ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశాం. ప్రజలకు సాధ్యమైనంత వరకు అవగాహన వచ్చి ఉంటుంది. ఫైర్​ సేప్టీ అనేది నిరంతర ప్రక్రియ. రోజువారి దినచర్యలో ఎంతగానో ఉపయోగపడుతుంది." - నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక డీజీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.