Fire Accidents in Hyderabad : జంట నగరాల్లో గంటల వ్యవధిలోనే ఐదు చోట్ల అగ్నిప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. మల్కాజిగిరి, రహ్మత్‌నగర్, షాలిబండ, ఉప్పల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. మల్కాజిగిరిలోని విజయ్‌నగర్ కాలనీలో నివసించే రాఘవరావు, రాఘవమ్మ దంపతులు దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు భార్య చీరకు మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో భర్త రాఘవరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
Fire Accident in Sangareddy : సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన రియాక్టర్లు
Fire Accident in Bajaj Electronic Shop Shalibanda : ఈ ఘటనలో ఆయన భార్య రాఘవమ్మ సైతం తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాతబస్తీలోని షాలిబండలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో (Bajaj Electronic Shop Shalibanda) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 6 అగ్నిమాపక శకటాలతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదాన్ని నియంత్రించేందుకు ఏకంగా 35 మంది సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్దమయ్యాయి.
Iraq Wedding Hall Fire : వెడ్డింగ్ హాల్లో భారీ అగ్నిప్రమాదం.. 114మంది మృతి.. మరో 150 మంది..
RahmatNagar Fire Fire Accident : యూసుఫ్‌గూడ రహ్మత్‌నగర్‌లోని పరుపుల తయారీ గోదాంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. నివాస ప్రాంతాల మధ్య గోదాం ఉండడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. జీడిమెట్లలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. డ్రమ్ములు లీకేజీ కావడంతో ప్రమాదం సంభవించింది.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉప్పల్ బాలాజీహిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో స్టేషనరీ దుకాణం దగ్దమైంది. పక్కనే ఉన్న టైలర్ షాప్‌లోకి మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. దుకాణంలో వెలిగించిన దీపం కారణంగా పుస్తకాలకు మంటలు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు.
Fire Accidents in Telangana : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ పూరి కాలనీలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి కావటంతో ఇంట్లోని వారు గడప వద్ద దీపాలు వెలిగించి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్క్రాప్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఓ పల్సర్ బైక్, వాషింగ్ మెషిన్‌కు మంటలు వ్యాపించడంతో పూర్తిగా మంటలకు ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదాలకు గల కారణాలపై అగ్నిమాపక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. దీపావళి నేపథ్యంలో బాణాసంచా దుకాణాల్లోకి దూసుకురావడంతో ప్రమాదం జరిగిందా, ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.