హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. 'ది ట్రాఫిక్' హోటల్లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో హోటల్ మూసి ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. కొన్నిరోజులుగా హోటల్ మూసిఉంటోందని స్థానికులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ'