హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని ఓ పాత హ్యూందాయ్ కారు షెడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక అధికారులు రావడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
- ఇవీ చూడండి: మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!