లాక్డౌన్ వేళ బయటకు వస్తున్న వాహనదారులపై జరిమానాలు విధించడం, వాహనాలు జప్తు చేయడంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వాహనాల సీజ్, జరిమానాలపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను మే 15లోగా తమకు సమర్పించాలని హెచ్ఆర్సీ ఆదేశించింది.
నిత్యావసరాల కోసం వాహనాలతో బయటకు వస్తే జరిమానాతో పాటు వాహనాలను జప్తు చేస్తున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన రవీందర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుకు హెచ్ఆర్సీ స్పందించింది.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు