ETV Bharat / state

BellamKonda Suresh Controversy: బెల్లంకొండ సురేశ్‌పై కేసు ఉపసంహరించుకున్న శరణ్ కుమార్ - telangana varthalu

BellamKonda Suresh Controversy: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్​తో ఆర్థిక లావాదేవీల వివాదం ముగిసిందని ఫైనాన్షియర్​ శరణ్​ కుమార్​ వెల్లడించారు. నిర్మాత సురేశ్​పై పెట్టిన కేసును ఆయన ఉపసంహరించుకున్నారు. ఇటీవల ఓ సినిమా నిర్మాణ విషయంలో 85 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్​పై ఫిర్యాదు చేసిన శరణ్​ కుమార్​.. పెద్దల మధ్యవర్తిత్వంతో వివాదం పరిష్కరించుకున్నామన్నారు.

BellamKonda Suresh Controversy: బెల్లంకొండ సురేశ్‌పై కేసు ఉపసంహరించుకున్న శరణ్ కుమార్

author img

By

Published : Mar 16, 2022, 4:40 PM IST

BellamKonda Suresh Controversy: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు సాయిశ్రీనివాస్​కు ఫైనాన్షియర్ శరణ్ కుమార్ క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఓ సినిమా నిర్మాణ విషయంలో 85 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్​పై శరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టు జోక్యంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో తాజాగా ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినట్లు శరణ్ కుమార్ తెలిపారు.

సీసీఎస్​కు వచ్చిన శరణ్... బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు శ్రీనివాస్​పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని క్షమాపణలు కోరుతూ పెద్దల జోక్యంతో తమ మధ్య వివాదం సద్దుమనిగిందని తెలిపారు. తమ అకౌంట్స్ సిబ్బందికి, బెల్లంకొండ మేనేజర్స్​కు మధ్య సమాచార లోపం కారణంగా ఈ వివాదం నెలకొందని స్పష్టం చేశారు. తమకు రావాల్సిన నగదులో కొంత ఇచ్చారని శరణ్ కుమార్ వెల్లడించారు.

వివాదం ముగిసింది..

బెల్లంకొండ సురేశ్‌తో ఆర్థిక లావాదేవీల వివాదం ముగిసింది. పెద్దల మధ్యవర్తిత్వంతో వివాదాన్ని పరిష్కరించుకున్నాం. మా అకౌంటెంట్స్‌, సురేశ్‌ మేనేజర్లకు సమాచారలోపం వల్ల వివాదం నెలకొంది. మాకు రావాల్సిన డబ్బులో కొంత చెల్లించారు. దీనితో ఏ సంబంధం లేని సాయిశ్రీనివాస్ పేరు ప్రస్తావించినందుకు క్షమాపణలు కోరుతున్నా. -శరణ్ కుమార్, ఫైనాన్షియర్​

అసలేం జరిగిందంటే..

Cheating Case on Bellamkonda Suresh : హైదరాబాద్‌కు చెందిన శరణ్ అనే వ్యాపారి.. 2018లో బెల్లంకొండ శ్రీనివాస్ చేసే ఓ సినిమా కోసం ఆయన తండ్రి బెల్లంకొండ సురేశ్ తన వద్ద రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం బెల్లంకొండ సురేశ్​, శ్రీనివాస్​పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలమ మేరకు.. పలు సెక్షన్ల కింద ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినట్లు ఫైనాన్షియర్​ శరణ్​ కుమార్​ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.