Financial Losses to State Power Distribution Companies: విద్యుత్ సంస్థలు ట్రూఅప్ ఛార్జీల కింద బిల్లులు వసూలు చేసుకునేందుకు ఈఆర్సీకీ పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్రంలో 2016 నుంచి 2023 మధ్య ఒక్కసారి మాత్రమే కరెంటు ఛార్జీలు పెంచామని మిగతా ఆరేళ్లలో పాత ఛార్జీలు వసూలు చేయడం వల్ల కరెంట్ కొనుగోలు, పంపిణీ ఖర్చులు పెరిగాయని డిస్కంలు పేర్కొన్నాయి.
దాదాపు 7 వేల 961 కోట్ల రూపాయలను ప్రభుత్వం డిస్కంలకు ఈక్విటీ రూపంలో అందజేసినట్లు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. మరో 9 వేల 236 కోట్లు ట్రైపార్ట్ ఎమ్ఓయూ ద్వారా చెల్లించగా, డిస్కంలు ఇంకా 12 వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిని రాబోయే విద్యుత్ బిల్లుల కింద వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగరావుకు విజ్ఞప్తి చేశాయి.
అందులో ఎస్పీడీసీఎల్కు 9వేల కోట్లు.. ఎన్పీడీసీఎల్కు 2 వేల 954 కోట్లు నష్టం వచ్చినట్లు డిస్కంలు పిటీషన్ లో వెల్లడించాయి. గత 15 సంవత్సరాలుగా ట్రాన్క్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, విద్యుత్ ఉద్యోగుల జీతాలు తదితర వంటి వాటికింద.. విద్యుత్ పంపిణీ ఖర్చుల కోసం సుమారు 4 వేల కోట్ల రూపాయలు డిస్కంలు అధనంగా చెల్లించినట్లు ఈఆర్సీ కమీషన్‌కు పిటీషన్లో సమర్పించాయి.
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తరువాత ఈఆర్సీ ట్రూఅప్ చార్జీలపై తుది నిర్ణయం తీసుకుంటుందని శ్రీరంగారావు తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచడంలేదని డిస్కంలు ప్రకటించాయని పేర్కొన్నారు. ఇప్పటికే డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని, అవి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ట్రూఅప్ ఛార్జీలు ఎంతో కొంత వసూలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చదవండి: