ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ పరిహార మొత్తం 3,975 కోట్లను, కేంద్ర నుంచి జూన్ నెలకు సంబంధించి రాష్ట్ర వాటాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని... రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి... కేంద్ర ప్రభుత్వంలోని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమైన లక్షా 76వేల కోట్ల రూపాయల ఐజీఎస్టీ మొత్తాన్ని.... రాష్ట్రాలకు పంచాలని నిర్ణయం తీసుకున్న కేంద్రానికి... ధన్యవాదాలు తెలిపిన మంత్రి... రాష్ట్రానికి రావాల్సిన 2 వేల 800 కోట్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో... రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందని... దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం పొందిన రాష్ట్రం... తెలంగాణ అని ఆయన అన్నారు.
ఆదాయ వృద్ధిలో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ.. కోవిడ్ -19 వల్ల ఆదాయం భారీగా పడిపోయిందని చెప్పారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సహకారిగా ఉండాలన్న హారీష్ రావు... ఆదాయం కోల్పోవడం అన్ని రంగాలపై ప్రభావం చూపడంతో పాటు... ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోను కోత విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే... ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన జీఎస్టీ పరిహార మొత్తం... 3 వేల 975 కోట్లను, కేంద్రం నుంచి జూన్ నెలకు సంబంధించి రాష్ట్ర వాటాను వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం సైతం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల్లో... కోత పెట్టిందన్న మంత్రి... కేంద్రం నిర్ణయాలు గుదిబండగా మారుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఆరంభం భయపెట్టినా.. చివరకు అనూహ్య లాభాలు