ETV Bharat / state

HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది' - తెలంగాణ వార్తలు

గడచిన ఆరేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సుస్థిరాభివృద్ధి సాధిస్తుంటే విపక్ష నేతలు వాస్తవాలను మరచి దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు(harish rao) ఆక్షేపించారు. ఆరేళ్లలో రాష్ట్ర వృద్ధి రేటు, తలసరి ఆదాయం, తదితర అంశాలపై నివేదిక విడుదల చేసిన ఆయన... కేంద్రంతో పాటు భాజపా(bjp) పాలిత రాష్ట్రాలను మించి తెలంగాణ వృద్ధిలో దూసుకెళ్తోందని వివరించారు. రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొచ్చి మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని(kishan reddy) డిమాండ్ చేసిన మంత్రి... తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని భాజపా, కాంగ్రెస్‌(congress party) పాలిత రాష్ట్రాల్లో చూపుతారా? అని సవాల్ విసిరారు.

minister harish rao, harish about finance
ఆర్థిక మంత్రి హరీశ్ రావు, తెలంగాణ ఆర్థిక వృద్ధిరేటు
author img

By

Published : Aug 23, 2021, 1:18 PM IST

Updated : Aug 23, 2021, 5:14 PM IST

తెలంగాణ(telangana) రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరేళ్లలో తెలంగాణ ఆర్థిక పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి, తలసరి ఆదాయం, సొంత ఆదాయం, ఆయా రంగాల్లో అభివృద్ధి సహా అప్పుల సంబంధిత గణాంకాలతో నివేదికను రూపొందించారు. హైదరాబాద్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంబంధిత అంశాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(harish rao) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy), బండి సంజయ్(bandi sanjay), భాజపా, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతున్నట్లు మంత్రి చెప్పారు. విపక్షాలు అవగాహనా రాహిత్యంతో, ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు.

అద్భుత వృద్ధి రేటు

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుత వృద్ధిరేటు నమోదు చేస్తోందన్న హరీశ్ రావు... కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ప్రబల సాక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు తెలంగాణలో 14.3 శాతం ఉంటే దేశ సగటు కేవలం 3.6 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఐటీ ఎగుమతులు ఆరేళ్లలో 120 శాతం పెరిగాయని వివరించారు. దేశ వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ కంటే వెనకబడిందన్నారు. రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని... రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆరేళ్లలో 90శాతం పెరిగిందని మంత్రి వివరించారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో 2.59 శాతంతో చాలా తక్కువగా ఉందని అన్నారు. ఏ రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో లేదని, తెరాస ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.

ఆరేళ్లలో దేశం 7 శాతం వృద్ధి రేటు సాధించింది. రాష్ట్రం 11.52 శాతం వృద్ధి రేటు సాధించింది. దేశ ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్‌ కంటే తక్కువగా ఉంది. భాజపా హయాంలో వృద్ధిరేటు బంగ్లాదేశ్‌ కంటే తక్కువగా ఉంది. దేశ తలసరి ఆదాయం కన్నా బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంది. ఆ దేశ వృద్ధిరేటు మన దేశం కంటే దాదాపు 5 శాతం ఎక్కువ. భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది.

-హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

దేశంలోనే అగ్రగామిగా..

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్లే అద్భుతమైన వృద్ధి నమోదైందన్న హరీశ్ రావు... గొర్రెల పంపిణీ వల్ల అద్భుత ప్రగతి సాధించామనడానికి కేంద్ర ప్రభుత్వ లెక్కలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. వరి ధాన్యం 500 రెట్లు పెరిగిందని చెప్పారు. పరిశ్రమల రంగంలోనూ 72 శాతం వృద్ధి రేటు నమోదైందన్న మంత్రి... తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. పరిశ్రమల రంగంలోనూ 72 శాతం వృద్ధి రేటు నమోదు చేశామని తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. సేవా రంగంలోనూ 34.7 శాతం వృద్ధి నమోదైందని వివరించారు.

దుష్ప్రచారం తగదు

అప్పుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రం విధించిన పరపతికి లోబడే జీఎస్‌డీపీ(GSDP)లో 22.83 శాతమే తెలంగాణ అప్పులు ఉన్నాయని హరీశ్ రావు వివరించారు. చాలా ఇతర రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తే... తెలంగాణ నుంచి వెళ్ళేది ఎక్కువ, వచ్చేది తక్కువని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

కిషన్‌రెడ్డి నిధులు తెచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఏ రంగంలో వృద్ధి సాధించారో ఆయన చెప్పాలి.పెరిగిన ధరల గురించి కూడా కిషన్‌రెడ్డి మాట్లాడాలి. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి.. రాయితీ తగ్గించారు. ఆస్తులు అమ్మడంలోనూ కేంద్రం వృద్ధి సాధించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. రాబోయే రోజుల్లో అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు అందిస్తాం. కేసీఆర్, తెరాస ఉన్నన్నాళ్లు రాష్ట్రంలో మొదటి స్థానం మాదే. రెండో స్థానం కోసం కాంగ్రెస్, భాజపా పోరాడుతున్నాయి. ప్రజా సమస్యలు లేకపోవడమే ప్రతిపక్షాల సమస్య. ఉద్యోగ ఖాళీల వివరాలు సిద్ధం చేశాం. త్వరలోనే కేబినెట్‌లో నివేదిస్తాం. ఏ జిల్లా వారికి నష్టం జరగకుండా కసరత్తు చేస్తున్నాం. జిల్లాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నాం.

-హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

ధరల్లో పెరుగుదల

అన్ని రంగాల్లో తగ్గుదల, ధరల్లో పెరుగుదల... ఇదీ భాజపా అభివృద్ధి అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు లేకపోవడమే ప్రతిపక్షాల సమస్య అని చురుకలు అంటించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చూపుతారా? అని సవాల్ విసిరారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్ విషయంలో ఎన్నో మాట్లాడారని కానీ... ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు. దళితబంధు(dalitha bandhu) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయంగా చూడడం లేదన్న హరీశ్ రావు... రాష్ట్ర అభివృద్ధి, సంపాదలో భాగస్వామ్యంగా చూస్తోందని తెలిపారు.

ఖాళీల వివరాలు సిద్ధం

ఉద్యోగ ఖాళీల వివరాలు సిద్ధమయ్యాయని, త్వరలోనే కేబినెట్‌కు నివేదిస్తామన్న మంత్రి ఏ జిల్లా వారికీ నష్టం జరగకుండా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ, విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలోనే తీర్మానం చేశామన్న ఆయన... గ్యాస్ రాయతీ తరహాలోనే విద్యుత్ రాయతీ తగ్గించి రైతులపై భారం వేసేలా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న హరీశ్... ప్రభుత్వ భరోసాతోనే అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదో నెల నుంచే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర విధానాలు బాగున్నాయి కాబట్టే అద్భుత ఫలితాలు వస్తున్నాయని వివరించారు.

ఇదీ చదవండి: VACCINE DRIVE: కొనసాగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Last Updated : Aug 23, 2021, 5:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.