అసహాయులకు జీవన భృతి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ తెలిపారు. వృద్ధులు, వితంతువులు, బీజీ కార్మికులు, బోదకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేతకార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, ఒంటరి మహిళలకు రూ. 2,016 ఫించన్ ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు 3016 రూపాయల చొప్పున ఇస్తున్నామన్నారు.
తెలంగాణలో 39,36,521 మందికి ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 2020-2021 సంవత్సరానికి ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మనిషికి రూ.200 చొప్పున 6, లక్షల 66 వేల మందికి రూ.105 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.
ఇదీ చదవండి: మహమ్మారి విరుచుకుపడ్డా నిలదొక్కుకుంటున్నాం: హరీశ్