Harish rao and Balakrishna meeting : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భేటి అయ్యారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్‌లోని మంత్రి ఛాంబర్లో వీరు సమావేశమయ్యారు. దాదాపు 15నిమిషాల పాటు మంత్రి హరీశ్ రావుతో చర్చించారు.
హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో.. మరింత ఎక్కువ మంది రోగులకు సేవలు అందించే లక్ష్యంతో.. నాలుగో డే కేర్ యూనిట్‌ని ఆస్పత్రి అందుబాటులోకి తీసుకువచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన డే కేర్ యూనిట్‌ని.. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ శనివారం ప్రారంభించారు. ఇప్పటికే ఆస్పత్రిలో మూడు డే కేర్ యూనిట్లు అందుబాటులో ఉండగా.. తాజాగా అందుబాటులోకి వచ్చిన సదుపాయంతో కలిపి డే కేర్ చికిత్సకు 181 పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆరోగ్య శ్రీ కింద సేవలు పొందుతున్న వారి కోసం.. ఇప్పటికే పడకలు పెంచామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. నీతి ఆయోగ్, బసవతారకం ఆస్పత్రిలోని సదుపాయాలను పరిశీలించి.. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా గుర్తించినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రిని ఆయన కలవడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లోని మంత్రి ఛాంబర్లో హరీశ్‌తో బాలయ్య భేటీ అయ్యారు.
ఇదీ చదవండి: 'లయన్' బాలయ్యతో 'లైగర్'.. సంక్రాంతికి గర్జన