Ali comments on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం ఆదేశిస్తే.. పవన్‌కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని నటుడు అలీ అన్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు. తాజాగా తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘‘పవన్‌కల్యాణ్ నాకు మంచి మిత్రుడు. అయితే, సినిమాలు, రాజకీయాలు రెండూ వేరు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లలో వైసీపీ విజయం ఖాయం. పార్టీ ఆదేశిస్తే, పవన్‌పై పోటీచేయడానికి సిద్ధం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీకి నేను రెడీగా ఉన్నా’’ - అలీ, ఏపీ ప్రభుత్వ సలహాదారు
ఇవీ చదవండి: