ETV Bharat / state

పంజా విసురుతున్న విషజ్వరాలు... కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

విష జ్వరాలు రాష్ట్ర ప్రజలపై పంజా విసురుతున్నాయి. డెంగీ భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. విషజ్వరాల విజృంభణతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు... రకరకాల పరీక్షలు చేస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

డెంగీ భయంతో... పరీక్షలు ఫుల్, పైసల్ నిల్
author img

By

Published : Sep 7, 2019, 11:30 AM IST

Updated : Sep 8, 2019, 8:06 AM IST

జ్వరాల బారిన పడి రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారు. డెంగీ సహా వివిధ రకాల వైరల్ ఫీవర్స్ సోకి... ఆస్పత్రులో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత 5 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1348 డెంగీ కేసులు నమోదు కాగా... గత 4 వారాల్లో సుమారు 1.31 లక్షల మంది విష జ్వరాల భారిన పడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక జ్వరాల బారిన పడుతున్న వారిలో సుమారు 50 శాతం మంది చిన్నారులే కావడం గమనార్హం. మరోవైపు జ్వరం వస్తే చాలు డెంగీ అని భయపడి ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వైద్యుల సలహాలేకపోయినా పరీక్షల కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం.

డెంగీ భయంతో... పరీక్షలు ఫుల్, పైసల్ నిల్

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అంతే...

జ్వరాల తీవ్రత అధికంగా ఉండటం వల్ల నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు ప్రతిరోజు 2 వేలకు పైగా ఓపీ కోసం వస్తున్నారు. ఇక పిల్లల అప్సత్రి నిలోఫర్​లో అయితే భారీస్థాయిలో క్యూలు కడుతున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు చిన్నారులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఇక గాంధీ ఉస్మానియాల్లోనూ పడకలు చాలక... నెలపైనే పడుకోబెట్టి వైద్యులు సేవలు అందిస్తున్నారు. కేవలం ఇది ప్రభుత్వాసుపత్రుల్లోనే కాదు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. సమస్య తీవ్రతను గుర్తించిన సర్కారు ప్రభుత్వాసుపత్రుల్లో ఉదయం, సాయంత్రం, సెలవు దినాలు, ఆదివారాల్లో కూడా ఓపీ సేవలను అందిస్తున్నప్పటికీ... వైద్య పరీక్షల కిట్​లు, మందులు అందించడంలో విఫలమైంది.

జ్వరం రాగానే డెండీ పరీక్షలొద్దు

జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి పౌష్టిక ఆహారం, కాచి చల్లార్చిన నీటిని తాగడం, వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. చిన్న జ్వరం వచ్చినా డెంగీ అని భయపడి అన్ని పరీక్షలు చేయించుకోవడం వృథా అంటున్నారు. మూడు నుంచి 4 రోజుల తగ్గకుండా జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటేనే... డెంగీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం: మోదీ

Tg_hyd_09_06_fevers_effecting_badly_in_city_pkg_3180198 Reporter : ramya krishna Note : ఇటీవల జ్వరాలకు సంబంధించి వచ్చిన visuals... ghmc మీటింగ్ లో ఈటెల బైట్ వాడుకోగలరు. ( ) విష జ్వరాలు రాష్ట్ర ప్రజలపై పంజా విసిరుతున్నాయి. డెంగ్యూ భయం తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. మరి ముఖ్యంగా చిన్నారుల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. జ్వరం తో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పేరుగుతుండటం తో ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరో వైపు ప్రైవేట్ ఆస్పత్రులు కొన్ని పరిస్థితిని అదునుగా చేసుకుని కాసులు చేసుకుంటున్నారన్న విమర్శలు జోరుగా వినిపోయిస్తున్నాయి.... Look. Vo: జ్వరాల భారిన పడి రాష్ట్ర ప్రజలు విలవిలలాడుతున్నారు. డెంగ్యూ సహా వివిధ రకాల వైరల్ జ్వరాలు సోకి...ఆస్పత్రులో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత 5 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1348 డెంగ్యూ కేస్ లు నమోదు కాగా...గత 4 వారాల్లో సుమారు 1.31 లక్షల మంది విష జ్వరాల భారిన పడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక జ్వరాల భారిన పడుతున్న వారిలో సుమారు 50 శాతం మంది చిన్నారులే కావడం గమనార్హం. మరోవైపు జ్వరం వస్తే చాలు డెంగ్యూ అని భయపడి ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు...వైద్యులు సలహాలేకపోయిన.... పరీక్షల కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ విషయమై ఇటీవల జిఎహెచ్ ఎంసీ , హెల్త్ సమన్వయ సమావేశం లో మంత్రి ఈటెల ప్రస్తావించారు.....బైట్ బైట్ : ఈటెల రాజేందర్ , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి. Vo: జ్వరాల తీవ్రత అధికంగా ఉండటం తో నగరం లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు రోజు 2 వేలకు పైగానే ఓపి కోసం వస్తున్నారు. ఇక పిల్లల అప్సత్రి నిలోఫేర్ అయితే ఏకంగా భారీస్థాయిలో క్యూ లు కడుతున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు చిన్నారులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఇక గాంధీ ఒస్మానియాల్లోనూ పడకలు చాలక...నెలపైనే పడుకోబెట్టి వైద్యులు సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పడకలు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం, సాయంత్రం ఓపి సేవలను సర్కారు అందిస్తున్న... తగినన్ని మందులు, వైద్య పరీక్షల కిట్ లు అందుబాటులో లేక రోగులు ఇబ్బందుకు పడుతున్నారు.....spot Evo: జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి పౌష్టిక ఆహారం, కచి చల్లార్చిన నీటిని తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత తో జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్యులు. ఇక జ్వరం వస్తే డెంగ్యూ అని భయపడి వృధా టెస్ట్ లు చేపించాల్సిన అవసరం లేదని.... జ్వరం తీవ్రత 3 నుంచి 4 రోజులు తగ్గక పోయినప్పుడే డెంగ్యూ పరీక్షలు అవసరమని స్పాస్టం చేస్తున్నారు.
Last Updated : Sep 8, 2019, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.