ETV Bharat / state

గ్రేటర్‌లో ఫీవర్ సర్వే... జ్వరం ఉంటే ఉచిత మెడికల్ కిట్లు - హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. మహానగరంలో ఈ రోజు జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ బృందాలు 1,76, 392 ఇళ్లలో సర్వేను చేపట్టాయి. జ్వరం లక్షణాలు ఉన్నవారికి ఉచిత మెడికల్ కిట్లను అందజేశాయి.

fever survey running in greater hyderabad
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
author img

By

Published : May 20, 2021, 8:25 PM IST

జీహెచ్‌ఎంసీలో ఫీవర్ సర్వేను వైద్యారోగ్యశాఖ బృందాలు చేపట్టాయి. ఇవాళ 1653 బృందాలు 1,76, 392 ఇళ్లలో సర్వేను పూర్తి చేశాయి. జ్వరం కేసులు నమోదైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బందితో యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేయించారు. మహానగరంలో ఇప్పటివరకు మొత్తం 15,31,507 ఇళ్లలో ఫీవర్ సర్వేపూర్తి చేశారు. ఇంటింటికి తిరిగి జ్వరం ఉన్న వారికి ఉచిత మెడికల్ కిట్లను అందచేశారు.

నగరంలోని ప్రతీ బస్తీ దవాఖానా, అర్బన్ హెల్త్ సెంటర్లు, అన్ని ఆస్పత్రుల్లో 17,150 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఆస్పత్రుల ద్వారా మొత్తం 2,68 ,674 మందికి పరీక్షలు చేశారు. కరోనా సంబంధిత సలహాలు, సూచనలకు జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు వైద్యాధికారులు సమాధానలు ఇచ్చినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు.. 23 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.