ETV Bharat / state

రోగులతో కిక్కిరిసిపోయిన ఫీవర్​ ఆస్పత్రి - నల్లకుంటలోని ఫీవర్​ హాస్పిటల్

హైదరాబాద్​లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. నల్లకుంటలోని ఫీవర్​ హాస్పిటల్​ రోగులతో నిండిపోయింది. అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేనందున రోగులు అవస్థలు పడుతున్నారు. ఒక్కో బెడ్​పై ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు.

రోగులతో కిటకిటలాడుతున్న ఫీవర్​ ఆస్పత్రి
author img

By

Published : Aug 27, 2019, 5:04 AM IST

Updated : Aug 27, 2019, 8:36 AM IST

హైదరాబాద్​లో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వైరల్ ఫీవర్ మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలతో హాస్పిటల్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో జ్వరాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఇక్కడికే రావడం వల్ల రోగులతో ఆస్పత్రి ప్రాంగణమంతా నిండిపోయింది. అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేనందున అవస్థలు పడుతున్నారు.

సిబ్బంది కొరత:

ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్​కి సంబంధించిన కౌంటర్ల సంఖ్య తక్కువగా ఉండటం, కంప్యూటర్లు మొరాయించడం వల్ల రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరతతో క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దాటుకొని లోపలికి వెళ్లాక వైద్యులు తక్కువగా ఉన్నందున మరింత సమయం వేచి ఉండాల్సివస్తుంది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు అడ్మిషన్​ పొందాక ఆస్పత్రిలో సరిపడా బెడ్లు లేక ఒక్కో బెడ్​పై ఇద్దరిని పడుకోబెట్టి సెలైన్​ ఎక్కించాల్సి వస్తుంది.

ఓపీ కౌంటర్ల సంఖ్య ఎక్కువగా లేకపోవడం, వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని ఆస్పత్రి సూపరిండెంట్​ కె. శంకర్​ అన్నారు. ఓపీ సమయాన్ని పెంచి రోగులకు ఎటువంటి సమస్యలు రాకుండా చేస్తున్నామని ఆయన తెలిపారు.

రోగులతో కిటకిటలాడుతున్న ఫీవర్​ ఆస్పత్రి

ఇవీ చూడండి: విషజ్వరాల విజృంభణతో ఆసుపత్రులు కిటకిట

Intro:Body:Conclusion:
Last Updated : Aug 27, 2019, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.