దసరా, దీపావళి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఫెస్టివల్ మేళా జరగనుంది(Festival Mela at Nampally Exhibition Ground). ఈ నెల 11నుంచి 31 వరకు... 20 రోజుల పాటు మేళా నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ తెలిపారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది నుమాయిష్(Numaish Exhibition) నిర్వహించలేదని.. ఈ ఫెస్టివల్ మేళా ద్వారా చిన్న పరిశ్రమల, చేతి వృత్తుల వారికి ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ మేళాలో 300 స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లేయింగ్ గేమ్స్, హ్యాండ్లూమ్స్, కశ్మీర్, రాజస్థాని డ్రెస్సెస్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని రకాల కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేళాను అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
కొవిడ్ వల్ల 2021లో నూమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించలేదు. ఈసారి ఫెస్టివల్ మేళా అనే పేరుతో చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము. ఈనెల 11 నుంచి 31 వరకు 20రోజుల పాటు మేళా నిర్వహిస్తాము. నుమాయిష్ అప్పుడైతే ఏవైతే స్టాల్స్ ఉంటాయో.. అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు 300 వరకు స్టాల్స్ ఉంటాయి. అన్ని రకాల వసతులు కల్పించాము. దసరా, దీపావళి సందర్భంగా ఈ మేళా నిర్వహిస్తున్నాము. జనవరి 1 2022 నుంచి ఎప్పిటిలాగే నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తాము.-ప్రభాశంకర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి
ఇదీ చూడండి: Rana at Onco Cancer Centre: '45 ఏళ్లు దాటిన మహిళలు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి'