ETV Bharat / state

కానిస్టేబుల్​ని అభినందించిన దత్తాత్రేయ... ప్రశంస పత్రం అందించిన సీపీ - హైదరాబాద్ జిల్లా వార్తలు

భారీ వర్షాలతో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో సాహసంతో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ వీరేందర్​ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. కానిస్టేబుల్​కు ప్రశంస పత్రాన్ని పంపించారు. దానిని కానిస్టేబుల్ వీరేందర్​కు సీపీ అంజనీ కుమార్ ​అందించి అభినందించారు.

felicitation to police constable by cp anjani kumar
కానిస్టేబుల్​ని అభినందించిన దత్తాత్రేయ... ప్రశంస పత్రం ఇచ్చిన సీపీ
author img

By

Published : Nov 14, 2020, 9:55 AM IST

చిలకలగూడ ఠాణాలో పనిచేస్తోన్న వీరేందర్ అనే కానిస్టేబుల్​ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. అక్టోబర్​లో కురిసిన వానల వల్ల వచ్చిన వరదల్లో ఆయన చేసిన సేవలను మెచ్చుకున్నారు. భారీ వర్షాలతో దోమలగూడలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. డయల్ 100కు ఫిర్యాదు రావడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వీరేందర్ ఆ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్న 25 మందిని బోట్ సాయంతో సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. ప్రాణాలకు తెగించి రెస్క్యూ చేసి వరద బాధితులను కాపాడారు.

కానిస్టేబుల్​ చేసిన ఈ సేవలను తెలుసుకున్న బండారు దత్తాత్రేయ... ప్రశంస పత్రాన్ని పంపించారు. కానిస్టేబుల్ వీరేందర్​కు ప్రశంశాపత్రాన్ని సీపీ అంజనీ కుమార్ అందించి అభినందించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌.. ఆధునిక సాంకేతిక రంగానికి పరిచయ వేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.