దక్షిణాది రాష్ట్రాల బియ్యం అవసరాలను ఇప్పటికే తీరుస్తున్న తెలంగాణకు త్వరలో పశ్చిమ బంగాల్ నుంచి ఆర్డర్ వస్తుందని ఆశిస్తున్నట్లు ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ అశ్వని గుప్తా తెలిపారు. రబీ సీజన్లో భారీ స్థాయిలో ధాన్యం దిగుబడి రానున్న రాష్ట్రానికి ఇది మరింత ఊతమిస్తుందని అన్నారు.
లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు బియ్యం అవసరాల కోసం రాష్ట్రంపైనే ఆధారపడి ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2లక్షల 52వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసినట్లు వెల్లడించారు. ప్రజాపంపిణీ, ఎన్ఎఫ్ఎస్ఏ అవసరాలను తీర్చటం కోసం పౌరసరఫరాల శాఖతో సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: పారిపోయిన ప్రేమజంట- లాక్డౌన్ రూల్స్‌కు బుక్కైందంట!