ETV Bharat / state

నా బంగారం.. బుజ్జి... మందు తీసుకురా తల్లీ! - wines

ఈ చిన్నారులను చూస్తే.. బాధేస్తోంది. దుర్మార్గుడైన ఆ తండ్రి తీరును అర్థం చేసుకోలేని వారి అమాయకత్వం.. ఆవేదన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో తన కూతుళ్లను.. బార్​కు తీసుకెళ్లిన ఈ నీచుడి వ్యవహారం.. తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

నా బంగారం.. బుజ్జి... మందు తీసుకురా తల్లీ!
author img

By

Published : Aug 13, 2019, 10:16 AM IST

పిల్లల ముందు మద్య పానం చేయాలంటే.. ఏ తండ్రి అయినా కాస్త ఆలోచిస్తాడు. తన కన్న పిల్లల ముందు తాగాలంటే.. ప్రేమతో కాస్త భయపడతాడు కూడా. ఇక.. ఆడపిల్లలకు మాత్రం ఆ వాసనే దారి దాపుల్లోకి రానివ్వకుండా.. వారికి దూరంగా మందు తాగేస్తుంటారు చాలామంది తండ్రులు. కానీ... ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ మహానుభావుడు అమానవీయంగా ప్రవర్తించాడు. తన చిన్నారి కూతుళ్లను బార్​కు​ తీసుకెళ్లి ..వారితోనే మద్యం తెప్పించుకుని మరీ తాగేశాడు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ బార్​లో ఈ ఘటన జరిగింది. అందరూ చూస్తున్నా.. ఏ మాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా తన పని తాను పూర్తి చేసుకున్నాడు. పైగా.. ఆ చిట్టి తల్లులకు సుద్దులు కూడా చెప్పాడు. తండ్రి తీరును అర్థం చేసుకోలేని ఆ బంగారు తల్లులు మాత్రం.. అమాయకంగా తలూపడం చూస్తుంటే.. అయ్యో.. అని అనుకోనివారు ఉండరు.

వాస్తవానికి.. చిన్నారులను మద్యం దుకాణాల్లోకి అనుమతించకూడదు. అలాంటిది షాపులోకి చిన్నారులను తీసుకెళ్లడమే కాదు.. వారితోనే తెప్పించుకుని.. వారి ఎదుటే ఇలా ప్రవర్తిస్తున్నా... షాపు నిర్వాహకులు అడ్డు చెప్పలేదు. తోటి మందుబాబులు అడ్డుకోలేదు. ఇలా అయితే చిన్న పిల్లలు కూడా పెడదోవ పడతారని.. అధికారులు స్పందించాలని.. ఈ వ్యవహారాన్ని గమనించిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లల తండ్రితోపాటు.. షాపు యజమానులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కూతుర్లతో మద్యం తెప్పించుకుని తాగిన తండ్రి

ఇదీ చదవండి: వరద తగ్గుతోంది.. బురద తేలుతోంది

Intro:చిన్న పిల్లలకు మద్యం అమ్మితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తూనే ఉంటారు.కానీ గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని బార్ షాపులో నిర్వాహకులు మాత్రం అధికారుల మాటలను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ తండ్రి తన పిల్లల చేత మద్యం తెప్పించి అక్కడే ఉండి తాగడమే ఇందుకు నిదర్శనం. రేపల్లె రైల్వే స్టేషన్ సమీపంలోని రాయల్‌ బార్‌లో చిన్న పిల్లలైన తన కూతుర్లతో మద్యం తెప్పించి షాపులోనే...మందు బాబుల మద్యలో ఉంచి ఓ తండ్రి మద్యం సేవించాడు. పిల్లలు దుకాణాల్లోకి అనుమతించకూడదు...అలాంటిది షాపులోకి చిన్నారులను తీసుకొచ్చి మద్యం సేవిస్తున్న నిర్వాహకులు కనీసం చెప్పక పోగా..చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా అయితే చిన్న పిల్లలు కూడా పెడదోవ పడతారని ..సంబధిత అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.Body:AvConclusion:Etv contributer
Sk.meera saheb 7075757517
Repalle,guntur jilla

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.