Father Rapes Daughter Hyderabad : నేటి సమాజం ఎటువైపు అడుగులు వేస్తుందో అర్థం కావడం లేదు. మానవ సంబంధాలు మరిచిపోయి కొందరు వ్యక్తులు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావి వరుసలు చూడకుండా.. కన్నకూతురే అనే విషయాన్ని మరచిపోయి.. పాపం అభంశుభం ఎరుగని ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో తండ్రి.
Man sentenced to 20 Years Imprisonment for Raping Daughter : ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఘోరం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. అందులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన తీర్పును నాంపల్లి కోర్టు గురువారం వెలువరించింది. ఆ మానవ మృగానికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడికి శిక్షతో పాటు రూ.5000 జరిమానా కూడా విధించింది. బాధిత బాలికకు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు(Court) ఆదేశించింది.
కేసు వివరాలు ఇలా.. హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో నివాసం ఉండే హఫీజ్‌కు ఆరుగురు సంతానం. అందులో నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మద్యానికి బానిసైన హఫీజ్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటుండటంతో అతని భార్య భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించేది. కుటుంబాన్ని పోషించాలనే జ్ఞానాన్ని మరచిపోయి.. పూర్తిగా మద్యానికి బానిసై.. కట్టుకున్న భార్య భిక్షాటన చేసి డబ్బులు సంపాదిస్తే వాటితో పేలగా తాగేవాడు.
Extra Marital Affair Murder Rangareddy : హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం.. ఏడుగురు అరెస్టు
Father Sentenced 20 Years Imprisonment in Rape Case : 2021 నవంబర్ ౩౦వ తేదీన భార్య భిక్షాటన కోసం బయటికి వెళ్లడంతో.. హఫీజ్ తన పదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న పక్కింటి వ్యక్తి వచ్చి కాపాడాడు. ఇంటికి వచ్చిన తల్లి కూతురిపై జరిగిన లైంగిక దాడి గురించి తెలుసుకుంది. భర్త హఫీజ్‌పై హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన నాంపల్లి కోర్టు హఫీజ్‌ను దోషిగా తేల్చింది. బాధిత బాలికకు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
72 Year Old Man Who Sexually Assaulted Boy : మరోవైపు హైదరాబాద్‌లో బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ 72 ఏళ్ల సయ్యద్ రాహుఫ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పాన్‌షాప్‌ను బస్తీవాసులు ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున బజరంగ్‌దళ్ కార్యకర్తలు చేరుకోవటంతో ఉద్రిక్తతలు ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని పరిశీలించిన వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో చట్టం, 377 ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశామనిడీసీపీ చెప్పారు.