సాగు చట్టాలు నిరసిస్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద రైతు సంఘాలు ఆందోళన నిర్వహించారు. దేశవ్యాప్త రైతు ఉద్యమానికి మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేతలు పాల్గొన్నారు.
కేంద్ర సాగు చట్టాలు రైతులకు ఉరితాళ్ల వంటివని చాడ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే రైతులకు రక్షణ ఉండకపోగా... వ్యవసాయ రంగం, మార్కెటింగ్ వ్యవస్థ క్షీణిస్తుందని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ సర్కారుకు మనసు ఉంటే మూడు చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: నిలిచిపోయిన రైళ్లు- ప్రయాణికులకు ఆహారం, నీరు సరఫరా