ETV Bharat / state

Farmers Problems: కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడుతున్న అన్నదాతలు... - తెలంగాణ వార్తలు

ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు అడుగడుగునా అవస్థలే... విత్తు విత్తడం మొదలుకొని పంట కోసి అమ్మేవరకూ(Farmers Problems) కష్టాలే. అన్ని అవస్థలకోర్చి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా... రైతులకు కష్టాలు తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో రైతన్నల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడే పట్టాలు లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Problems
Farmers Problems
author img

By

Published : Nov 22, 2021, 10:38 AM IST

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల లేమి అన్నదాతను(farmers Problems at purchasing centers) వేధిస్తోంది. రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా... వారికి కష్టాలు మాత్రం తప్పడం లేదు. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడే పట్టాలు (టార్పాలిన్లు) కూడా చాలాచోట్ల లేవు. వాటిని సొంతంగా కొనలేక, రోజుకు వందల రూపాయలు అద్దె చెల్లించి తెచ్చుకోలేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో వారికి అవస్థలు తప్పడంలేదు. పట్టాలే కాకుండా ధాన్యం తూకం వేసే, తేమ కొలిచే, శుభ్రపరిచే యంత్రాల కొరత వల్ల రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మూడు ప్రభుత్వ విభాగాలు కలసి చేయాలి. ధాన్యం కొనేది రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్‌లు, యంత్రాలు ఎన్ని అవసరమో అంచనా వేసి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నివేదికను మార్కెటింగ్‌ శాఖకు పంపాలి. వాటికి అవసరమైన నిధులను మంజూరుచేసి కొనేందుకు ‘రాష్ట్ర వ్యవసాయ యంత్రాల అభివృద్ధి సంస్థ’ (ఆగ్రోస్‌)కు మార్కెటింగ్‌ శాఖ ఉత్తర్వులివ్వాలి. ఆగ్రోస్‌ అవసరమైనవి కొని జిల్లాల వారీగా పంపిణీ చేయాలి. కానీ వాటి మధ్య సమన్వయం లోపించి కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలోని 156 కేంద్రాలకు రెండువేల టార్పాలిన్లు కావాలని జిల్లా కమిటీ కోరింది. వాటిని గుజరాత్‌ నుంచి కొనాల్సి ఉండగా ఇప్పటికీ రప్పించలేదు.

ఎందుకీ అవస్థలు...

ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లపై అంచనాలు, సదుపాయాల కల్పనపై ప్రణాళికాబద్ధమైన చర్యల్లేక సమస్యలొస్తున్నాయి. గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ రాష్ట్రంలో 61.30 లక్షల ఎకరాల్లో సాగైందని, కోటీ 40 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు రెండు నెలల కిందట అంచనా వేశాయి. ఈ ధాన్యాన్ని కొనేందుకు గ్రామాలవారీగా కేంద్రాలను అక్టోబరు చివరి నుంచి ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ తెలిపింది. వరి నాట్లు దాదాపు ఆగస్టు చివరికల్లా పూర్తయి ఎంత ధాన్యం వస్తుందనే అంచనాలు కూడా వెలువడ్డాయి. వెంటనే అన్ని ప్రభుత్వ విభాగాలు కలసి ధాన్యాన్ని కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసి ఉంటే ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిసే సమస్యలు పెద్దగా ఉండేవి కాదు.

  • గత మార్చి నాటికి 1,69,426 టార్పాలిన్లు, 4318 ప్యాడీ క్లీనర్స్‌, 9580 తూకం యంత్రాలు, 7985 తేమ కొలిచే మీటర్లు కొని మార్కెటింగ్‌శాఖ కొనుగోలు కేంద్రాలకు ఇచ్చింది.
  • ఇవి కాక...ఈ సీజన్‌లో 21,197 టార్పాలిన్లు, 1312 ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు (ప్యాడీ క్లీనర్స్‌), 1384 తూకపు యంత్రాలు, మరో 1075 ధాన్యంలో తేమ కొలిచే మీటర్లు కొనాలని ఇప్పటివరకు 17 జిల్లా కమిటీలు మార్కెటింగ్‌శాఖకు ప్రతిపాదనలు పంపాయి. ఇవి కూడా కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందు కాకుండా కొనుగోళ్లు ప్రారంభించాక తీరికగా గ్రామాలవారీగా వివరాలు సేకరించి జిల్లా కమిటీలు పంపుతున్నాయి. కానీ గత నెల రోజుల నుంచే రైతులు ధాన్యాన్ని అమ్మడానికి తెచ్చి రోడ్లకిరువైపులా, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోస్తున్నందున వర్షాలకు తడిసి వర్షపునీటిలో కొట్టుకుపోతున్నాయి.
  • ఏటా టార్పాలిన్లు, తూకం వేసే, శుభ్రపరిచే, తేమ కొలిచే యంత్రాలు మార్కెటింగ్‌శాఖ కొని ఇస్తున్నా వాటిని తీసుకున్న కేంద్రాల నిర్వాహకులు తిరిగి ఇవ్వడం లేదు. సమీపంలోని మార్కెట్లకు తీసుకెళ్లి ఇవ్వడానికి ట్రాక్టర్‌ కిరాయిలకు సొమ్ముల్లేవని వారి వాదన. మార్కెట్ల సిబ్బంది కూడా వాటిని తిరిగి తీసుకోవడం లేదు.
  • ఏటా ఎన్ని కొంటున్నారు? వాటిని మరుసటి సీజన్‌కు భద్రపరిచారా.. లేదా? అనేది ఎవరూ తనిఖీ చేయక వదిలేయడంతో అవి పాడైపోతున్నాయి. కొన్ని మాయమై చివరికి కొనుగోలు సమయానికి కొరత ఏర్పడుతోంది.
  • ఇప్పటికే 1,90,623 పరదాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికి తెరిచిన 6 వేల కొనుగోలు కేంద్రాలకు వీటిని పంచితే ఒక్కోదానికి 31 టార్పాలిన్లుండాలి. కానీ అందులో సగం కూడా లేవని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Rice Cultivation Issue: యాసంగిలో వరి సాగుపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.