ఏపీ రాజధాని ప్రాంతంలో కీలకమైన కరకట్ట విస్తరణ పనులను రైతులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టను ఆనుకొని ఉన్న పొలాలకు పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టవద్దని రైతులు ఫ్లెక్సీలు కట్టారు. గతేడాది జూన్ నెలలో ఇదే సమస్య ఉత్పన్నం కావడంతో సీఆర్డీఏ అధికారులు.. రైతులతో చర్చలు జరిపారు. 2003 భూ సేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అప్పట్లో సమావేశం ముగించారు.
తాజాగా రైతుల పొలాల్లోని అరటి చెట్లను నిర్మాణ సంస్థ ప్రతినిధులు జేసీబీలతో తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. పనులను అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్డీఏ అధికారులు.. పరిహారంపై చర్చించేందుకు ఈ నెల 13, 14 తేదీల్లో తుళ్లూరులోని తమ కార్యాలయానికి రావాలని రైతులకు సూచించారు.
ఇవీ చదవండి :