ETV Bharat / state

'గ్రామీణ భారత్ బంద్‌ విజయవంతం చేయాలి' - farmers associations called to gramina bharath bandhu

దేశ భవిష్యత్ కోసం వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు జనవరి 8న తలపెట్టిన "గ్రామీణ భారత్ బంద్‌"ను విజయవంతం చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్​లో అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి సమావేశం జరిగింది.

farmers associations  called to gramina bharath bandhu
'గ్రామీణ భారత్ బంద్‌ విజయవంతం చేయాలి'
author img

By

Published : Dec 20, 2019, 5:11 PM IST

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత​ రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్ కోసం వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు జనవరి 8న తలపెట్టిన "గ్రామీణ భారత్ బంద్‌"ను విజయవంతం చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

స్వామినాథన్ కమిషన్ సిఫారసులు

స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయటంతో పాటు రైతులను రుణాల నుంచి విముక్తి చేయాలన్న 21 రకాల డిమాండ్లపై బంద్​ చేపడతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో రైతులు, కూలీలు, చేతివృత్తిదారులు సహా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడంపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి లేఖలు

నేటి నుంచి 31 వరకు గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... ఎక్కడికక్కడ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని రైతు సంఘాల నేతలు సూచించారు. జనవరి 1 నుంచి 5 వరకు కేంద్రం, రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి లేఖలు రాయాలని... 6, 7 తేదీల్లో సైకిల్‌ ర్యాలీలు నిర్వహించాలని కోరారు.

'గ్రామీణ భారత్ బంద్‌ విజయవంతం చేయాలి'

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.