ETV Bharat / state

విద్యుదాఘాతాలు... అన్నదాతలు, మూగజీవాల మృత్యువాత - electrocution news

దుక్కిదున్ని పంటల సాగు చేపడుతున్న అన్నదాతలను అడవి పందులతోపాటు ఇతర జంతువులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటి బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేస్తున్న విద్యుత్తు కంచెలు రైతులనే బలి తీసుకుంటున్నాయి. ఈనేపథ్యలో ‘ఈటీవీ భారత్​’ కథనం.

electrocution
విద్యుదాఘాతంతో మృత్యువాత పడుతున్న రైతులు, మూగజీవాలు
author img

By

Published : Oct 7, 2020, 8:54 AM IST

పూడూరు మండలం రాకంచర్లకు చెందిన అంగోత్‌ గోపాల్‌ ఈఏడాది సెప్టెంబరులో దోమ మండలం దిర్సంపల్లిలోని అత్తగారింటికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం బయటికి వెళ్లిన ఆయన మరుసటి శివారులో మృతి చెంది కనిపించాడు. కాళ్లకు కాలిన గాయాలు కావటంతో అడవి పందుల కోసం ఓ రైతు పొలానికి వేసిన విద్యుత్తు కంచెకు తాకి మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

బొంరాస్‌పేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి గడ్డల శివకుమార్‌ గతేడాది సెప్టెంబరులో ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. పక్క పొలం యజమాని పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగను తాకడంతో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు ఏటా జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి.

ప్రధాన శత్రువు అడవిపందులే..

వికారాబాద్​ జిల్లాలోని రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో ప్రధాన పంటగా పత్తి, మొక్కజొన్న, కంది వంటి వివిధ పంటలతోపాటు టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్‌, బీట్‌రూట్‌, బెండ, కాకర వంటి కూరగాయ సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు పశువుల గ్రాసం కోసం తప్పనిసరి పరిస్థితిలో మొక్కజొన్న వేశారు. ఎన్కెపల్లి, గొంగుపల్లి, పూడూరు, కండ్లపల్లి, మీర్జాపూర్‌, శేరిగూడ, చెంచుపల్లి తదితర గ్రామాల్లో ఇతర పంటల సాగుకు పెద్దగా ఆస్కారం లేదు. దీంతో మొక్కజొన్నను పండిస్తున్నారు. ఇదే సమయంలో అడవి పందులు పంట పొలాల్లోకి చేరి దాడులు చేస్తూ ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి మొక్కలను తొక్కుతూ కంకులను కొరికేస్తున్నాయి. టమాటా, క్యారెట్‌ తదితర కూరగాయలను తినేస్తున్నాయి. పత్తి కాయలను సైతం కొరికేసి పంటను నాశనం చేస్తున్నాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా..

దాడుల నుంచి పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో గతంలో నుంచే చుట్టూ పాత చీరలను కట్టి ఉంచుతున్నారు. మరికొందరు సన్నటి తాడుకు పంది కొవ్వును పూసి వాసనకు పందులు రావని కడుతున్నారు. ఇంకొందరు రాత్రీళ్లు కాపలాగా ఉంటూ టపాసులు కాల్చుతూ శబ్దాలు చేస్తున్నారు. కరెంటు ఛార్జింగ్‌తో రాత్రంతా పనిచేసే మైకు పెడుతున్నారు. వీటి వల్ల ఇతరులకు పెద్దగా హాని ఏమీ ఉండదు. కానీ ఇవన్నీ ఉపయోగించినా అడవిపందులు ఆగడం లేదు. పంటలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. దీంతో కొందరు రైతులు వారి పొలం చుట్టూ ఇనుప తీగను ఏర్పాటు చేసి రాత్రివేళల్లో కరెంటు షాక్‌ పెడుతున్నారు. కానీ సమీపంలోని పొలాలకు చెందిన రైతులు అనుకోకుండా వచ్చి తీగలను తాకి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల గొంగుపల్లి-కొత్రెపల్లి సమీపంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలోని గుర్రాలు మేతకు వెళ్లి ఇలాగే మృత్యువాత పడ్డాయి. పోలీసులు సంబంధిత రైతుపై కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

రాత్రింబవళ్లు కాపలా ఉన్నా..

అటవీ ప్రాంతంలో పంట పండించాలంటే ఏటా పందులతో భయపడుతున్నాం. ఈసారి రెండు ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి, ఎకరంలో కంది వేశా. మొక్కజొన్నకు బుట్టలు వస్తుండటంతో వర్షంలోనూ పొలానికి కాపలగా ఉంటున్నా.. పందులు పొలంలోకి దూరి సగం పంటను నాశనం చేశాయి. - బాలయ్య, రైతు, కండ్లపల్లి

అవగాహన కల్పిస్తున్నా వినడం లేదు..

అడవి పందుల నివారణ కోసం విద్యుత్తు తీగలు ఏర్పాటు చేయవద్దని సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నాం. తీగలు పెట్టినట్లు గుర్తించి నిలదీస్తే తప్పించుకునే సమాధానం చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నా వినడం లేదు. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. - రాంచందర్‌, విద్యుత్‌ ఏఈ, పూడూరు

ఇవీ చూడండి: పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.