గవర్నర్ నరసింహన్కు ప్రగతి భవన్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ముగిసింది. రేపు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఇవాళ నరసింహన్కు ప్రగతి భవన్లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదేళ్ల కాలంలో తమకు అన్ని విధాలా సహకరించారని.. ముఖ్యమంత్రి కేసీఆర్.. నరసింహన్ సేవలను ప్రశంసించారు. కార్యక్రమానికి మంత్రులు, సభాపతి, ఉప సభాపతి హాజరయ్యారు.
కార్యక్రమం అనంతరం.. గవర్నర్ దంపతులు రాజ్ భవన్ వెళ్లారు. అక్కడ సిబ్బందికి వీడ్కోలు పలికి.. 4గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. వీడ్కోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. నరసింహన్ వెంట.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి, ఏడీసీ వెళ్లనున్నారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: 'ల్యాండర్ కష్టమే- ఆర్బిటర్ భద్రం'