ప్రముఖ క్యాన్సర్ వైద్యులు, ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ రఘురామ్‌కు అరుదైన గౌరవం లభించింది. భారత్‌లో క్యాన్సర్ రోగులకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి శ్రీలంక ప్రభుత్వం.. ది కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ శ్రీలంక నుంచి హానరరీ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ శ్రీలంక 49వ వార్షిక సదస్సులో ప్రకటించింది.
ద రాయల్ కాలేజ్ ఆఫ్ ఎడిన్ బర్గ్ సహకారంతో జరిగిన ఈ వార్షిక సదస్సులో డాక్టర్ రఘురామ్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ కన్జర్వేషన్ మీద కీలక ఉపన్యాసం చేశారు. శ్రీలంకన్ సర్జికల్ కాలేజీ అందించే అత్యున్నత పురస్కారానికి తనను ఎంపిక చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డును మాతృదేశానికి, కుటుంబ సభ్యులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్టు తెలిపారు.
హానరరీ ఫెలోషిప్‌కు ఎంపికవడం నిజంగా గొప్ప విషయం. వైద్య సేవల్లో భారత్, శ్రీలంక కలిసి పనిచేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శస్త్ర చికిత్స సేవలను మెరుగుపర్చుకునేందుకు.. నిపుణులు, ట్రెయినీలను పరస్పరం వినియోగించుకునే అవకాశం ఉంది. కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న సిబ్బందికి సెల్యూట్ చేస్తూ.. శ్రీలంక సర్జికల్ కాంగ్రెస్-2020 విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
-డాక్టర్ రఘురామ్, ప్రముఖ కాన్సర్ వైద్యుడు
ఇదీ చదవండి: హైదరాబాద్ చుట్టూ ఐటీ క్లస్టర్ల ఏర్పాటు: మంత్రి కేటీఆర్